టిడిపి హయాంలో బూటకపు పెట్టుబడులు..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి పార్టీ పై ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీలు వెనక్కి వెళ్లి పోతున్నట్లు వేల కోట్ల పెట్టుబడులు ఆగిపోతున్నాయి..అంటూ ఒక పుస్తకాన్ని ప్రచురించారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఆ పుస్తకంలో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి. సింగపూర్‌ స్టార్టప్‌ ప్రాజెక్టులు (50 వేల కోట్లు), బీఆర్‌ శెట్టి సంస్థలు (12 వేల కోట్లు), రేణిగుంటలో రిలయన్స్‌ (15 వేల కోట్లు), కియా అనుబంధ పరిశ్రమలు (2 వేల కోట్లు), ఒంగోలులో ఏపీపీ పేపర్‌ పరిశ్రమ (24 వేల కోట్లు), విశాఖలో అదానీ డేటా సెంటర్‌ (70 వేల కోట్లు) వెనక్కు వెళ్లిపోవడమో.. పెట్టుబడులను కుదించుకోవడమో చేశాయి. ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ రూ. మూడున్నర వేల కోట్ల రుణం నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయంగా రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చింది…అంటూ టీడీపీ అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర విమర్శలు చేసింది ఆ పుస్తకంలో . ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే. కానీ ఇన్ని లక్షల కంపెనీలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడిగా రాష్ట్రంలో పెట్టకపోవడంతో…ఇవన్నీ పుస్తకంలో తెలుగుదేశం పార్టీ ప్రచురించిన కంపెనీలు బూటకపు కంపెనీలు మరియు బూటకపు పెట్టుబడులు అని తెలుగుదేశం పార్టీ ప్రచురించిన పుస్తకం పై సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.