డాక్టర్ ప్రియాంకరెడ్డి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం: మంత్రి తలసాని

వాస్తవం ప్రతినిధి: దుండగుల చేతిలో అత్యాచారం, హత్యకు గురైందని భావిస్తున్న డాక్టర్ ప్రియాంకరెడ్డి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మాయిలు సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పోలీసింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.