దివంగత ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఏమి విత్తాడో అదే కోశాడు…!

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పై అప్పట్లో పార్టీలో అల్లుడు గా చలామణి అవుతూ కీలక వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్ గా ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని…ఆయన పై చెప్పులు వేయించారని మానసికంగా సీనియర్ ఎన్టీఆర్ ని బాధ పెట్టడం జరిగిందని చాలామంది అప్పటినుంచి ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న రాజకీయ నేతలు సీనియర్ నేతలు చంద్రబాబు రాజకీయం గురించి కామెంట్ చేస్తుంటారు.

ఇటువంటి నేపథ్యంలో తాజాగా దివంగత ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు అప్పట్లో ఏమి చేశారో…ఇప్పుడు ఆయనకు రాజధాని ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో అదే జరిగిందని అంటున్నారు. ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ప్రతిపక్ష నేత చంద్రబాబు తో బస్సు లో పర్యటించిన సందర్భంలో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు …తమ భూములను రాజధాని పేరిట బలవంతంగా చంద్రబాబు లాగేసుకుని..ఇష్టానుసారంగా వ్యవహరించారని…చంద్రబాబు పర్యటన సందర్భంగా నిరసన చేపడుతూ చంద్రబాబు వెళుతున్న బస్సు పై చెప్పులు విసిరారు.

దీంతో ఈ విషయం ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ కావడంతో ..చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు…చంద్రబాబు తాజా రాజధాని పర్యటనలో దివంగత ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఏమి విత్తాడో అదే కోశాడు అని కామెంట్ చేస్తున్నారు.