‘అలా వైకుంఠపురం లో’ సినిమా టీజర్ లేటెస్ట్ న్యూస్…?

వాస్తవం ప్రతినిధి:  రాబోయే సంక్రాంతికి అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురం లో’ సినిమా రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసినదే. ‘నా పేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్. మరోపక్క గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ‘అలా వైకుంఠపురం లో’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అలా వైకుంఠపురం లో సినిమాతో పాటుగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కూడా విడుదలవుతున్న క్రమంలో ఆ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల అవ్వటంతో ఊహించని విధంగా మంచి రెస్పాన్స్ మహేష్ టీజర్ కి రావడంతో…తాజాగా అలా వైకుంఠపురం లో సినిమా టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని అభిమానులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. దీంతో అల వైకుంఠపురం లో సినిమా యూనిట్ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా సినిమా టీజర్ డిసెంబర్ మొదటి వారంలో గానీ రెండో వారంలో గానీ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ ఛానల్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో టీజర్ ఇంకెంత హడావిడి సృష్టిస్తుందో అని బన్నీ అభిమానులు టీజర్ కోసం బాగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.