సిరియాలో హైఅలర్ట్…బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

వాస్తవం ప్రతినిధి: సిరియా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో అ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఆస్పత్రులు, విద్యాసంస్థల లక్ష్యంగా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. శుక్రవారం ఇద్లిబ్ లో రెండు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ ఉగ్రవాదుల దాడుల్లో 22 మంది మృతి చెందగా, 30మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఉగ్రవాదుల దాడులతో సిరియాలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో సిరియా ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.