నల్లగా మారిపోయిన ఊపిరితిత్తులు…షాకైన డాక్టర్లు!

వాస్తవం ప్రతినిధి: పొగతాగుతున్నారా? అయితే ఒక్కసారి ఇది చదవండి. పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసినా కూడా చాలా మంది పొగత్రాగడం మానరు. నికోటిన్ ఆరోగ్యానికి చెడు కలిగిస్తుందని తెలిసినాకూడా చాలా మంది పొగత్రాగడాన్ని మానరు. అలాంటి పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే. పొగతాగే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదమే కాదు, నిద్రకూడా సరిగ్గా పట్టదని న్యూయార్క్ లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ, వైద్య విభాగంలో పని చేస్తున్న సైంటిస్ట్ ఇర్ఫాన్ రెహ్మాన్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. నిజానికి పొగత్రాగడం మగవారికి మాత్రమే కాదు వారి పిల్లలకు కూడా ప్రమాదమే. వారు పొగత్రాగడం వల్ల పిల్లలను ఆస్త్మాఆవహించే అవకాశాలు మూడు రేట్లు ఎక్కువగా ఉంటాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఇది తెలిసీ చాలా మంది పొగత్రాగడం మానేద్దాం.. మానేద్దాం.. అనుకుంటూనే.. దానిని కొనసాగిస్తున్న వారెందరో ఉన్నారు. పొగ తాగే అలవాటుకు సాధ్యమైనంత తొందరగా ఆపకపోతే అది చివరకు మన ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఓ వ్యక్తి పొగకు బానిస అవడంతో.. అతని ఊపిరితిత్తులు పూర్తిగా నల్లగా మారిపోయాయి. చైనాకు చెందిన ఓ 52 ఏళ్ల వ్యక్తి బ్రెయిడ్‌ డెడ్‌కు గురయ్యాడు. ఆ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఆ వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని స్కాన్‌ చేస్తున్న క్రమంలో అతని ఊపిరితిత్తులను చూసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. తని ఊపిరితిత్తులు పూర్తిగా నల్లగా మారిపోయాయి, ఊపిరితిత్తులు ట్రాన్స్‌ప్లాంట్‌ చేసేందుకు పనికి రావని డాక్టర్లు తేల్చిచెప్పారు. నిత్యం పొగాకు సేవించడం వల్లే ఊపిరితిత్తులు ఆ విధంగా మారాయని వైద్యులు తెలిపారు.