శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో వల్లభనేని వంశీ సీటు ఎక్కడ…?

వాస్తవం ప్రతినిధి: 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా చోట్ల వైసిపి పార్టీ గెలిచిన గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఫ్యాన్ గాలి తట్టుకొని ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇరవై మూడు స్థానాలకే పరిమితం కావడంతో ఇంతగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయేసరికి చాలా మంది ఆ పార్టీలో ఉన్న నమ్మకమైన నాయకులు పార్టీని విడిపోవడం జరిగింది. ఇదే క్రమంలో వల్లభనేని వంశీ కూడా ఇటీవల తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదు అంటూ మీడియా ముందు చంద్రబాబు నాయుడిని మరియు లోకేష్ ని బండబూతులు విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తన నియోజకవర్గ ప్రజల కోసం ఓటు వేసిన వారి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పదవిలో కొనసాగుతున్నట్లు వంశీ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2వ తారీఖు నుండి శీతాకాల సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో…అసెంబ్లీలో వంశీ పాల్గొంటే… ఎక్కడ కూర్చుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి అక్కడ వాళ్లతో కలిసి కూర్చోలేరు. వైకాపాలో జాయిన్ కాలేదు కాబట్టి అక్కడ కూర్చోలేడు. ఇప్పుడు ఆయన సీటు ఎక్కడ అన్నది ప్రస్నార్ధకంగా మారింది. ఇప్పుడు వంశి ఏ పార్టీలో లేడు కాబట్టి స్వతంత్రుడిగా సింగిల్ గా కూర్చునే అవకాశం ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.