ధోనీ ఫాన్స్ కు గుడ్ న్యూస్!

వాస్తవం ప్రతినిధి: గత కొన్ని నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న మిస్టర్ కూల్ ధోనీ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ధోనీ నెట్ ప్రాక్టీస్ చేశాడు. జార్ఖండ్ బౌలర్లు విసురుతున్న బంతులను ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఫిట్ నెస్ పై దృష్టి సారించాడు. క్రికెట్ కు ధోనీ గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్తలు ప్రచారం అవుతున్న వేళ… ధోనీ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో భారత్ ఓటమిపాలైన తర్వాత ధోనీ ఇంత వరకు క్రికెట్ ఆడలేదు. వెస్టిండీస్ సిరీస్ కు పూర్తి ఫిట్ నెస్ తో జట్టుకు అందుబాటులోకి వచ్చేందుకు ధోనీ ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.