హ్యాట్రిక్‌ విజయాలతో టీ20 సిరీస్‌ కైవసం​ చేసుకున్న భారత్ మహిళా జట్టు

వాస్తవం ప్రతినిధి: వెస్టిండీస్‌ పర్యటనలో భారత మహిళా జట్టు అద్భుత విజయాలతో దూసుకెళుతోంది. వెస్టిండిస్‌ మహిళలతో టీ20 సిరీస్‌ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా మూడో టీ20లో కూడా విజయం సాధించి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 59 పరుగులు మాత్రమే చేసింది. 60 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. జెమీమా రోడ్రిగ్స్‌ (40 నాటౌట్‌) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హర్మన్‌ప్రీత్‌ (7), దీప్తి శర్మ (7)లతో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది. ఈ విజయంతో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది భారత్ మహిళా జట్టు.