వాస్తవం ప్రతినిధి: జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్తాన్లో శిక్షణ పొందారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తేదీ లేని, ఎప్పుడూ మాట్లాడిందో తెలియని ముషారఫ్ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ను పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ బుధవారం ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఆ వీడియోలో ముషారఫ్.. “1979 వ సంవత్సరంలో పాకిస్థాన్ ప్రయోజనం కోసం ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాం. ప్రపంచం నలుమూలల నుంచి ముజాహిదీన్లను తీసుకువచ్చి వారికి మేం శిక్షణ ఇచ్చి, ఆయుధాలు కూడా సరఫరా చేశాం. తర్వాత వారిని వారి సొంత ప్రాంతాలకు పంపించి ప్రపంచ వాతావరణాన్ని మార్చేశాం అని వ్యాఖ్యానించారు. అంతే కాదు ఒసామా బిన్ లాడెన్, జవహిరీ, జలాలుద్దీన్ హక్కానీ పాకిస్థాన్ హీరోలు అని ముషారఫ్ పేర్కొన్నారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడే ముజాహిదీన్లకు గౌరవ స్థానం ఇచ్చామని ఆ వీడియోలో ముషారఫ్ పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో