త్వరలో కరెంట్ విమానాలు: నాసా

వాస్తవం ప్రతినిధి: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గత కొన్నేండ్లుగా చేస్తున్న ప్రయోగాలన్నీ ఓ కొలిక్కివచ్చాయి. విద్యుత్‌ ఇంధనంతో నడిచేలా నాసా రూపొందించిన విమానం త్వరలో గాల్లో చక్కర్లు కొట్టనుందని ఆ సంస్థ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్‌ ప్రయోగశాలలో పరీక్షించామని, రిజల్ట్ సంతృప్తిగా ఉందని నాసా పేర్కొంది. మరికొన్ని నెలల్లో ఎడ్వర్డ్‌ ఎయిర్ ఫోర్స్ బేస్‌ నుంచి ఈ ఎలెక్ట్రిక్ విమానం గాల్లోకి ఎగురుతుందని నాసా పేర్కొంది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్‌వెల్‌ ‘ఎక్స్‌-57’ అని పేరు పెట్టింది. నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు ప్రాజెక్టు మేనేజర్‌ బ్రెంట్‌ కోబ్‌లీ.