నేనేంటో చైనాకు తెలుసు: అమెరికా అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: రెండు ఆగ్రరాజ్యల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడిందన్న ఆనందం మూనాళ్ల ముచ్చటే అయింది. చైనా ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేసేలా ఎలాంటి ఒప్పందమూ కుదరలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సుంకాల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చైనా కోరుకుందే తప్ప, పూర్తిగా పన్నుల ఎత్తివేత్తపై చర్చలు జరగలేదని ట్రంప్‌ సృష్టం చేశారు. తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఎటువంటి వాడినో చైనాకు తెలుసునని, తానింకా ఎలాంటి డీల్‌కూ ఓకే చెప్పలేదని అన్నారు.