గ్రీస్‌లో చైనా అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌కు చేరుకున్నారు. గ్రీస్‌లో పెట్టుబడులు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం తదితర అంశాలపై గ్రీస్‌ అధ్యక్షుడు ప్రొకోపిస్‌ పావ్లోపౌలస్‌, జిన్‌పింగ్‌ చర్చించనున్నట్టు చైనా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. అనంతరం మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలోని పిరౌస్‌ నగరంలోని ఓడరేవు ప్రాంతాన్ని జిన్‌పింగ్‌ సందర్శించనున్నారు. పిరౌస్‌ ఓడరేవు పట్టణాన్ని చైనాకు చెందిన కాస్కో షిప్పింగ్‌ కంపెనీ అభివృద్ధి చేసింది.