సింధు, సైనా నెహ్వాల్ లకు మరో అవకాశం

వాస్తవం ప్రతినిధి: గత కొన్ని టోర్నీల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఫామ్‌లోకి వచ్చేందుకు మరో అవకాశం వచ్చింది. మంగళవారం హాంకాంగ్ లో అయితే హాంకాంగ్‌లో సత్తాచాటి పునర్వైభవాన్ని చాటాలని భావిస్తున్నది. చైనా ఓపెన్ తొలి రౌండ్‌లో సియా యన్ యన్(చైనా) చేతిలో ఓడిన సైనా.. మరోసారి ఆమెతోనే పోటీ పడనుంది. ప్రారంభం కానున్న హాంకాంగ్ ఓపెన్‌లో వారు బరిలోకి దిగనున్నారు. డబుల్స్‌లో సంచలన విజయాలతో దూసుకెళుతున్న రాంకీరెడ్డి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు. ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌గా అవతరించాక ఊహించని రీతిలో పీవీ సింధు నిరాశపరుస్తున్నది. గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరినా.. చైనా ఓపెన్‌లో తొలి రౌండ్ నిష్క్రమించింది. ఈ పరాజయాల పరంపరకు చెక్ పెట్టి హాంకాంగ్ ఓపెన్‌లో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. తొలి రౌండ్‌లో కిమ్ గా ఇన్(కొరియా)తో ఆరో సీడ్ సింధు తలపడనుంది. మరోవైపు ఈ ఏడాది గాయాలతో సతమతమవుతూ అధిక టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. అయితే హాంకాంగ్‌లో సత్తాచాటి పునర్వైభవాన్ని చాటాలని భావిస్తున్నది. చైనా ఓపెన్ తొలి రౌండ్‌లో సియా యన్ యన్(చైనా) చేతిలో ఓడిన సైనా.. మరోసారి ఆమెతోనే పోటీ పడనుంది.