రజత పతకం సాధించిన భారత షూటర్ సౌరభ్ చౌదరి

వాస్తవం ప్రతినిధి: ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరి రజత పతకం సాధించాడు. ఇతను ఫైనల్లో 244. 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఉత్తర కొరియా షూటర్ కిమ్ కోంగ్ గుక్ 246. 5 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్ కు చేరిన మరో భారత షూటర్ అభిషేక్ వర్మ 5 వ స్థానంలో నిలిచాడు. సౌరభ్, అభిషేక్ టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.