‘రూలర్’ సినిమాలో భారీ ఫైట్ చేస్తున్న బాలయ్య బాబు..!

వాస్తవం సినిమా: ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ తన తండ్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించాడు. ఒకటి సినిమా రంగానికి చెందినది ఐతే మరొకటి రాజకీయ రంగానికి చెందినది.

ఈ నేపథ్యంలో రెండు సినిమాలతో అభిమానులను అలరించాలని భావించిన బాలయ్య బాబుకి రెండు సినిమాల రిజల్ట్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన రెండు సినిమాలు దారుణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇటువంటి తరుణంలో కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న రూలర్ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతున్న క్రమంలో…సినిమాపై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్.

ఇదే క్రమంలో ఈ సినిమా కోసం బరువు తగ్గిన బాలయ్య …సినిమాకి సంబంధించిన పిక్స్ లో అదరగొట్టే స్టైల్లో అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా రూలర్ సినిమాలో భారీ ఫైట్ బాలయ్య బాబు చేయబోతున్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ ఏకంగా 500 మంది ఫైటర్స్ తో ఒక భారీ పోరాట సీన్ లో పాల్గొంటున్నారట. ఈ భారీ సీన్ సినిమాలో అదిరిపోతుందని, అలానే ఆయన ఫ్యాన్స్ ఈ సీన్ కు థియేటర్స్ లో విజిల్స్ తో అదరగొట్టడం ఖాయమని సినిమా యూనిట్ పేర్కొంది. డిసెంబర్ 20వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది.