‘సాహో’ ఎఫెక్ట్ తో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభాస్..!

వాస్తవం సినిమా: ‘బాహుబలి’ సినిమా తో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ తన కెరీర్ కి ఏర్పడటం తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని…దాదాపు రెండు సంవత్సరాల పాటు సాహో సినిమా కోసం తన టైం కేటాయించడం జరిగింది. ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలు ప్రభాస్ స్నేహితులు యు.వి.క్రియేషన్స్ సంస్థ అధినేతలు. అయితే సాహో సినిమా విడుదలయ్యే మొదటి షోకే దారుణంగా ఫ్లాప్ టాక్ రావడంతో …తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు ప్రభాస్.

ఇదే సమయంలో ప్రభాస్ అభిమానులు కూడా చాలా నిరుత్సాహం చెందారు. ముఖ్యంగా తన స్నేహితులు సాహో సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించి నష్టాలు చూడటంతో తీవ్ర ఆవేదనకు ప్రభాస్ గురైనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మొదటిలో హై బడ్జెట్లో చేద్దామని భావించిన క్రమంలో సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు అవుట్ డోర్ లో చేయాలని ముందు అనుకున్నా తాజాగా ప్రభాస్ మాత్రం అటువంటివి ఏమి పెట్టుకోవద్దని విదేశాల్లో ఎటువంటి లొకేషన్లు కావాలనుకుంటున్నారో అటువంటివి హైదరాబాదులో ఏదో ఒక స్టూడియోలో సెట్టింగ్స్ రూపంలో ట్రై చేయమని డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా నిర్మాతలు ప్రభాస్ స్నేహితులు యు.వి.క్రియేషన్స్ సంస్థకి చెందిన వాళ్లకి ప్రభాస్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా సాహో సినిమా ఎఫెక్ట్ అని నిర్మాతలు ఎక్కువగా నష్టపోకూడదనే భావన తో ప్రభాస్ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.