యాంకర్ సుమ రెమ్యునరేషన్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన రాజీవ్ కనకాల..!

వాస్తవం సినిమా: సినిమా ప్రేక్షకులకు ,తెలుగు టెలివిజన్ వీక్షకులకు యాంకర్ సుమ పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల ఆడియో వేడుకలకు మరియు ప్రి రిలీజ్ ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ వారి వారి అభిమానులను అలరిస్తూ ఒక పక్క టెలివిజన్ రంగంలో మరో పక్క సినిమారంగంలో యాంకరింగ్ విషయంలో బిజీ బిజీగా గడుపుతోంది సుమ.

ఇటువంటి నేపథ్యంలో టీవీ లలో చాలా షోలలో యాంకరింగ్ చేస్తున్న సుమ రెమ్యూనరేషన్ గురించి గతంలో అనేక వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సుమ రెమ్యూనరేషన్ గురించి ఆమె భర్త రాజీవ్ కనకాల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన నిజాలు బయటపెట్టారు.

రాజీవ్ కనకాల ఇంటర్వ్యూలో ఏమన్నారంటే…‘అసలు సుమ అన్ని షోలు చేస్తుంది కదా.. తెగ సంపాదించేస్తుంది అనుకుంటున్నారేమో.. తనకు వచ్చేది తక్కువేనని.. ఇన్ని సంవత్సరాలుగా.. షూటింగ్‌లో పెద్ద పెద్ద లైట్స్ మధ్య కష్టపడుతూ వచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే.. తన వెనుక నేను ఉన్నానని అనుకుంటారు. కానీ.. నిజానికి అందంతా ఆమె టాలెంట్‌నే.. నేను సలహాలు మాత్రమే ఇస్తాను తప్ప.. క్రెడిట్స్ తీసుకోనని చెప్పాడు రాజీవ్ కనకాల. అలాగే.. మరో విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ.. తన రెమ్యునరేషన్ ఎంతో కూడా తనకు తెలీదని.. మేము అసలు వాటి గురించి ఇంట్లో ప్రస్తావించమని చెప్పుకొచ్చాడు. సుమకు ఇవ్వాల్సిన స్పేస్ ఇచ్చేస్తానని.. ఇతర వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోనని’ రాజీవ్ తెలిపాడు.