శ్రీరామ నవమి రోజునే రామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: వచ్చే ఏడాది ఏప్రిల్ 2న శ్రీరామ నవమి రోజునే రామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి న్యాస్ ట్రస్టు వెల్లడించింది. మూడు నెలల్లో ఆలయ ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో, ట్రస్టు కొలువుదీరిన వెంటనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన 70 శాతం రా మెటీరియల్ సిద్ధంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం శిలా న్యాస్ లో పనులు నిలిచిపోయాయని, త్వరలోనే ఆ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. శిలా న్యాస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, ఆలయ స్తంభాలు, శిల్పాల పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి న్యాస్ ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు.