ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కు స్వల్ప అస్వస్థత

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానకు తరలించారు. వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను సాయంత్రం డిశార్జి చేయడంతో ఇంటికి తిరిగి వచ్చినట్ట్లు బంధువులు తెలిపారు. లతా బాగానే ఉన్నారని, ఆమె ఆరోగ్యంపై ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్‌ 28న లతా మంగేష్కర్‌ 90వ ఏట అడుగుపెట్టారు.