పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జగన్..!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటూ సీఎం జగన్ జీవో పాస్ చేయడంతో చాలామంది రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో తాను రాష్ట్ర ప్రజల పిల్లల కోసం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయం పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా కామెంట్ చేశారు జగన్.

అసలు ఆ కార్యక్రమంలో జగన్ ఏమన్నారంటే…ప్రస్తుతం ప్రపంచంతో యువతరం పోటీ పడుతుంది అని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదివితే ఉద్యోగాల్లో రాణిస్తారని వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని జీవో పాస్ చేస్తే చంద్రబాబు, వెంకయ్యనాయుడు మరియు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జగన్ పేర్కొంటూ…పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఇలా కామెంట్ చేశారు…‘‘ ఉదాహరణకు పవన్ కల్యాణ్ వున్నారు.. ఆయనకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి.. నలుగురో అయిదుగురో పిల్లలుండి వుంటారు.. మరి వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో కాకుండా.. తెలుగు మీడియంలో చదువుతున్నారా ?’’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వెంకయ్య, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. ఏపీలోని పేద పిల్లలేమో తెలుగులో చదువుకోవాలా ? ఇదేం రాజకీయం అని జగన్ కాస్త వ్యంగ్యంగా.. మరికాస్త ఘాటుగా సెటైర్ వేశారు. ప్రస్తుతం జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.