నవంబర్ 14 వ తారీకు నుండి రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల బాగా వర్షాలు పడిన నేపథ్యంలో మరోపక్క గత ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ఇసుక విషయంలో దారుణంగా అవినీతికి పాల్పడటం తో మొత్తం సిస్టం మార్చడానికి టైమ్ తీసుకుని జగన్ సర్కార్ ఇసుక విడుదల చేయాలని భావించిన క్రమంలో రాష్ట్రంలో వరదలు రావడంతో ఇసుక కొరత ఏర్పడింది.

దీంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా బాధలు పడ్డారు. అయితే ఇదే క్రమంలో ఇదే అదును చూసుకొని ఇసుక కొరత అంటూ విపక్షాలు గోల గోల చేసి జగన్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేక తిరుగుబాటు తీసుకురావాలని భావించి కొన్ని రాజకీయ పార్టీలు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు ,లాంగ్ మార్చ్ లు చేయడం జరిగింది. దీంతో ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం పట్ల తిరుగుబాటు తీసుకురావాలని భావిస్తున్న రాజకీయ నేతలకు సీఎం జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఈనెల అనగా నవంబర్ 14వ తారీఖున నుంచి నంబర్‌ 21 వరకూ ఇసుక వారోత్సవాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గతంలో ఇసుక విడుదల చేయడానికి ప్రభుత్వం రెడీ అయిన సందర్భంలో వర్షాలు వరదలు రావటం వల్ల విడుదల చేయలేకపోయామని ,కానీ గత వారం నుండి పరిస్థితి మెరుగుపడింది అని తెలుపుతూ సీఎం కార్యాలయం నుండి ఇసుక ను విడుదల చేస్తు ప్రకటన రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వ అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. దీంతో తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల భవన నిర్మాణ కార్మికులు ఎంతగానో సంతోషిస్తున్నారు.