కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిన సరయూ నది తీరం

వాస్తవం ప్రతినిధి: పుహ్నాని(పౌర్ణమి)ని పురస్కరించుకుని సోమవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆయోధ్యకు చేరుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా సరయూ నది ఒడ్డున పుణ్య స్నానాలు ఆచరించి, రామచంద్రుని దర్శించుకున్నారు. నదీ తీరం కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోయింది. గుజరాత్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్​గఢ్, హర్యానా నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. హోటళ్లు, దుకాణాలు రద్దీగా కనిపించాయి. మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అదనంగా మరింత మంది పోలీసులను మోహరించారు. ముఖ్యమైన రహదారులు, ప్రధాన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.