ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న ‘గ్రీన్‌ ఛాలెంజ్‌’

వాస్తవం ప్రతినిధి: హరితహారంలో భాగంగా పలువురు, సీనీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈగ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుతున్నారు. హరిత తెలంగాణ కోసం తన వంతు మద్దతుగా టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గతేడాది సంతోష్ కుమార్ నాటిన ఒక్క మొక్కతో మొదలైన గ్రీన్ ఛాలెంజ్ నేడు ప్రపంచ దేశాలకు విస్తరించింది.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్రం, దేశం ధాటి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరింది. తెలంగాణలోని ప్రజలకు దీని ఆవశ్యకతను తెలియజేయడానికి సిడ్నీలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మొక్కలు నాటారు. తెరాస ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ ను ఆ దేశపు డిప్యూటీ స్పీకర్ జాసన్ వుడ్ స్వీకరించారు. తెలంగాణలో మూడున్నర కోట్ల మొక్కలు నాటినట్లు నాగేందర్ రెడ్డి ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్ జాసన్ వుడ్ కు తెలియచేశారు. నాగేందర్ రెడ్డి ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్ జాసన్ వుడ్ కు మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు జాసన్ వుడ్ ధన్యవాదాలు తెలియజేస్తూ..మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు జాసన్ వుడ్ సంతోష్ కుమార్ ను అభినందించారు. హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఒక ఉద్యమంలా కొనసాగుతుందని, ఇది ఇలాగే కొనసాగుతూ తెలంగాణ పచ్చదనం, కాలుష్యం లేకుండా ఆరోగ్య ఆకు పచ్చ తెలంగాణ కావాలని కోరుకుంటున్నాని నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు.