ఫామ్‌హౌజ్‌లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ధోనీ చిల్‌

  వాస్తవం ప్రతినిధి: చివరిసారిగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ మైదానంలోకి దిగి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా రెండు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనే స్పష్టత లేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెలెక్టర్లకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏం చెప్పాడో తెలియదు కానీ.. ఎవరిని అడిగినా ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ తాత్కాలిక విరామంను ధోనీ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కూతురు జీవాతో. ఆదివారం రాంచీకి దగ్గరల్లోని తన ఫామ్‌హౌజ్‌లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ధోనీ చిల్‌ అయ్యాడు.