గంటా శ్రీనివాస్ కి షాక్ ఇచ్చిన జగన్..?

వాస్తవం ప్రతినిధి: గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి గా ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అప్పట్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడంతో గంటా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం మానేసినట్లు పార్టీకి దూరంగా ఉంటూ వేరే పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి నేపథ్యంలో ముందుగా అధికారంలో ఉన్న వైసిపి పార్టీలోకి రావడానికి గంట శ్రీనివాస్ ట్రై చేసినట్లు కానీ జగన్… గంటకి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే

ప్రస్తుతం బిజెపి పార్టీలో చేరడానికి గంట శ్రీనివాస్ రెడ్డి అయిన క్రమంలో దానికి బిజెపి పార్టీలో చేరకముందు…వైసీపీ పార్టీలో చేరడానికి జగన్ తో సంప్రదింపులు జరిపిన తరుణంలో జగన్ పెట్టిన కండిషన్ కి గంటా శ్రీనివాస్ నుండి సరైన సమాధానం రాకపోవడంతో వెంటనే జగన్ పార్టీలో చేరడానికి గంటాకి నో చెప్పినట్లు సమాచారం. అయినా గాని వైసీపీ పార్టీ ఉత్తరాంధ్రలో మరియు విశాఖలో చాలా బలంగా ఉన్న తరుణంలో గంటా శ్రీనివాస్ పార్టీలోకి రాకపోయినా పెద్దగా నష్టం ఉండదని జగన్ అనుకుంటున్నట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.