నవాజ్‌షరీఫ్‌ పై విషప్రయోగం జరిగింది: అల్తాఫ్ హుసేన్

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అరోగ్యంపై ఆ దేశానికి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నవాజ్‌షరీఫ్‌ను చంపేందుకు కుట్ర జరిగిందని..దీంతో ఆయన శరీరంలో పోలోనియమ్ అనే విషపదార్థాన్ని ఎక్కించారని పాకిస్తాన్‌కు చెందిన ముత్తాహిదా ఖౌమి మూవ్‌మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుసేన్ ఆరోపణలు చేశాడు. అయితే నవాజ్‌షరీఫ్ శరీరంలో పోలోనియమ్‌ను కనుక్కునేందుకు అంతర్జాతీయంగా ప్రత్యేక ప్రయోగశాలలో మాత్రమే ఈ అంశాన్ని కనుగునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

పోలోనియమ్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా రక్త కణాలను నాశనం చేస్తుందని , ఆ తర్వాత డీఎన్‌ఏపై దాడి చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుందని చెప్పారు. ఆ తర్వాత లీవర్ , కిడ్నీ, ఎముక గుజ్జులను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు.