ప్రాంతీయ శాంతికి పాకిస్థాన్‌ కట్టుబడి ఉంది: ఇమ్రాన్‌ఖాన్‌

వాస్తవం ప్రతినిధి: చారిత్రక కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం.. ప్రాంతీయ శాంతికి పాకిస్థాన్‌ కట్టుబడి ఉన్నదనేందుకు నిదర్శనమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌ వివాదం 70 ఏండ్లుగా ఇరుదేశాల మధ్య ద్వేషానికి కారణమైందని, ఆ వివాదానికి పరిష్కారం లభిస్తే ఇరుదేశాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ చారిత్రక దినం సందర్భంగా ఇరుదేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పంజాబ్‌ సీఎం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.