ఆస్కార్‌ అవార్డు గ్రహీత పోలాన్‌స్కిపై లైంగికదాడి ఆరోపణలు

వాస్తవం ప్రతినిధి: ఆస్కార్‌ అవార్డు గ్రహీత, దర్శకుడు రోమన్‌ పోలాన్‌స్కిపై తాజాగా లైంగికదాడి ఆరోపణలు గుప్పుమన్నాయి. తాను యువతిగా ఉన్నప్పుడు ఆయన స్కై రిసార్టులో తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ప్రముఖ ఫ్రెంచ్‌ మోడల్‌, సినీ నటి వాలంటైన్‌ మొన్నియర్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని లాస్‌ఏంజెల్స్‌ పోలీసులకు, ఫ్రెంచ్‌ గవర్నర్‌ బ్రిగెట్టే మాక్రాన్‌కు కూడా లేఖ ద్వారా విన్నవించానని వాలంటైన్‌ తెలిపారు.