రష్యా విక్టరీ డే వేడుకులకు అమెరికా అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: వచ్చే ఏడాది మేలో రష్యాలో జరగనున్న 75వ విక్టరీ డే మిలటరీ పరేడ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే సరిగ్గా అదే సమయానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుమీదుంటుందనీ, అయినప్పటికీ వీలుంటే తప్పకుండా హాజరవుతానని మీడియా సంస్థతో వెల్లడించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఆహ్వానాన్ని ట్రంప్‌ ప్రసంశించారు. కాగా, 1945లో నాజీ జర్మనీపై మిత్రరాజ్యాలు విజయం సాధించినందుకు గుర్తుగా రష్యా ప్రభుత్వం ప్రతిఏటా విజయోత్సవ దినాన్ని జరుపుతుంది.