ఫుట్‌పాత్‌లపై పడుకుంటే వెయ్యి డాలర్ల జరిమానా

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో ఫుట్‌పాత్‌పై పడుకుంటే 1000 డాలర్ల జరిమానా విధించనున్నట్టు నగర పాలక మండలి ప్రకటించింది. ఇందుకుగానూ నూతన చట్టాన్ని రూపొందించింది. అలాగే ఫుట్‌పాత్‌లపై ఎవరైనా టెంట్లు వేసినా నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి వెయ్యి డాలర్లు జరిమానా విధిస్తారు. అయితే, పర్యటక ప్రాంతాల్లో, రద్దీ ఎక్కువగా ఉంటే వాణిజ్య ప్రాంతాల్లో ఈ చట్టాన్ని మినహాయించినట్టు అధికారులు తెలిపారు. లాస్‌ వెగాస్‌లో పేద ప్రజలే కాకుండా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు సైతం ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారు. అలాగే నగరంలో ఇంటి అద్దెలు భారీగా పెరగడంతో చాలా మంది ఫుట్‌పాత్‌లపైనే జీవనం సాగిస్తుండటం గమనార్హం.