చైనాతో ఒప్పందం లేదు: అమెరికా అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టంచేశారు. సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్టు తెలిసిందని.. కానీ ఈ అంశంపై వారితో ఎలాంటి చర్చలు జరపలేదని ట్రంప్‌ చెప్పారు. తాను దానికి ఒప్పుకోనని వారికి తెలుసునని.. అందుకే సుంకాల ఎత్తివేత వార్తలను ఖండిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు.

ప్రస్తుతం చైనా ఆర్ధికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుందనీ, అందుకే ఇలాంటి ఒప్పందాలను చేసుకోవాలని ప్రయత్నిస్తున్న దని విమర్శించారు.
గతవారం ఇరు దేశాల మధ్య సుంకాలను దశలవారిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ముగియనున్నదని భావించారు. కానీ, తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనతో మళ్లీ ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.