చైనా ఓపెన్ – సెమీస్ లో పోరాడి ఓడిన సాత్విక్ జోడీ

వాస్తవం ప్రతినిధి: చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత బ్యాడ్మింటన్‌ పురు షుల జోడి సాత్విక్‌ సాయిరాజ్‌ రంకి రెడ్డి-చిరాగ్‌ శెట్టిల పోరు ముగిసింది. అద్వితీయ ప్రదర్శ నతో తమకంటె మెరుగైన ర్యాంకింగ్‌ జోడీలపై అనూహ్య విజయాలు సాధిస్తూ సెమీ స్‌కు దూసుకెళ్లిన భారత జోడి సెమీ ఫైనల్లో ఓడిపోయారు.

శనివారం జరి గిన సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ ఇండోనీసియా జోడి, మూడుసార్లు చాంపి యన్లు మార్కస్‌ ఫెర్నాల్డి గిడియోన్‌ -కెవిన్‌ సంజయ సుకముల్జొల చేతిలో 16-21, 20-22 స్కోరుతో పోరాడి ఓడారు. 9వ ర్యాంక్‌ భారత జోడి ఇండోనీసియా జోడి చేతిలో ఓడిపోవడం వరుసగా ఇది ఎనిమిదోసారి, ఈ ఏడాది మూడోసారి. ఈ ఏడాది ఆగస్టులో థాయిలాండ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన సాత్విక్‌-చిరాగ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్లో టాప్‌ ర్యాంకర్ల చేతిలోనే ఓడారు.