పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ చంద్రబాబే.. అంటున్న వైసీపీ నేత…!

వాస్తవం ప్రతినిధి: ఇసుక విధానం లో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం పై విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అనే నిరసన కార్యక్రమం చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి పార్టీ నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ చేసిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి వెనక నుండి కథ నడిపించింది ప్రొడ్యూసర్ పాత్ర పోషించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో వచ్చిన ఇసుక కొరత గురించి వివరిస్తూ ప్రకృతి వల్ల ఇసుక దొరకడం కష్టం గా మారితే దాన్ని అడ్డం పెట్టుకుని విపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఎవరైనా చనిపోతే దానికి కారణం ఇసుకే కారణమంటున్నారని అన్నారు. తమకి రౌడి యిజం చేతకాదని అలా వచ్చుంటే అన్ని నియోజక వర్గాల్లో ముప్పై వేల మెజారిటీ వచ్చేదని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి పనులు వెలికి తీస్తే పదహారు ఏళ్లు జైలులో ఉంటారని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు.