కమెడియన్‌గా శశి థరూర్‌ కొత్త అవతారం

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశి థరూర్ కొత్త అవతారం ఎత్తారు. అమెజాన్ ప్రైమ్ సిరీస్ కోసం ఆయన కమెడియన్‌గా మారిపోతున్నారు.”వన్ మైక్ స్టాండ్‌”లో స్టాండ్-అప్ కమెడియన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో వదిలింది అమెజాన్ ప్రైమ్.. 5 కామిక్స్ మెంటర్ 5 సెలబ్రిటీలు.. వారి జోక్‌లను చూసి మీరు నవ్వుతారు లేదా వారు ప్రయత్నిస్తుంటే మీకు నవ్వు వస్తుందంటూ.. ఓ కామెంట్ పెట్టి ఫొటో వదిలింది. కాగా, శశి థరూర్‌కు ఇది కొత్త కాదు.. ఇంతకు ముందు నెట్‌ఫ్లిక్స్ పేట్రియాట్ యాక్ట్‌లోనూ ఆయన కనిపించారు.