అమెరికా దాడి చేస్తే దీటుగా బదులిస్తాం: చైనా విదేశాంగ మంత్రి

వాస్తవం ప్రతినిధి: అమెరికా క్షిపణులను చైనాపై గురి పెట్టనంత వరకూ మా క్షిపణులతో ఆ దేశానికి ఎటువంటి ముప్పూ వుండదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖలోని ఆయుధ నియంత్రణా విభాగం అధికారి ఫు కాంగ్‌ చెప్పారు. అమెరికా తన క్షిపణులను చైనా వైపు గురి పెట్టటం ద్వారా ప్రాంతీయ శాంతి, భద్రతలకు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తోందని, అటువంటిదే జరిగితే తమ జాతీయ భద్రతను కాపాడుకునేందుకు ఎదురు దాడి చేస్తాం అని చైనా విదేశాంగ మంత్రి ఫు కాంగ్‌ తెలిపారు.