కర్తార్‌పూర్ సందర్శనకు ఎంట్రీ ఫీజు పెట్టిన పాకిస్థాన్‌

వాస్తవం ప్రతినిధి: గురు నానక్‌ 550వ జయంతి సందర్భంగా ఈ రోజు కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించే యాత్రికులకు ఎలాంటి ప్రవేశ రుసుం వసూలు చేయబోమని పాకిస్థాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని ఈ రోజు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం సంధర్భంగా ఒక్కొక్కరికి 20 డాలర్ల చొప్పున ప్రవేశ రుసుం వసూలు చేస్తామని పాక్‌ స్పష్టం చేసింది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత్ నుంచి 550 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. సిక్కుల మ‌త గురువు గురు నాన‌క్‌కు చెందిన గురుద్వారా ద‌ర్బార్ సాహిబా ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లో ఉన్న‌ది. అయితే ప్ర‌తి రోజూ 5 వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ వ వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమ‌తి ఇచ్చింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న న‌రోవ‌ల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్న‌ది.