భారత్‌ ప్రధాని నాకు మంచి మిత్రుడు: డొనాల్డ్‌ ట్రంప్‌

వాస్తవం ప్రతినిధి: జున్‌ 14, 1946న ఫ్రెడ్‌ ట్రంప్‌- మేరీ అన్నా మెక్‌లాయిడ్‌ దంపతులకు రెండో సంతానంగా డోనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్‌లో జన్మించారు. ట్రంప్‌ బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్క్‌లోనే పూర్తయ్యాయి.ట్రంప్‌ కుటుంబం జమైకా ఎస్టేట్స్‌లో ఉన్నప్పుడు క్యూ ఫారెస్ట్‌ స్కూల్లో చదువుకునేవారు. అయితే కొన్ని సమస్యల కారణంగా 13వ ఏటే ఆ స్కూల్‌ నుంచి బయటకు వచ్చేసి న్యూయార్క్‌ మిలటరీ అకాడమీలో చేరారు. అక్కడే హైస్కూల్‌ విద్యను పూర్తి చేశారు. తర్వాత బ్రోనెక్స్‌లోని ఫార్డమ్‌ విశ్వవిద్యాలయంలో రెండేళ్లు చదివారు. అనంతరం అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్‌ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్‌ స్కూల్‌ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ట్రంప్‌ రాజకీయ ప్రస్థానం పార్టీలు మారుతూ వచ్చింది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌ పలుమార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004, 2012, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా.. న్యూయార్క్‌ గవర్నర్‌ పదవిపై 2006, 2014లో దృష్టి పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. పలు ప్రయత్నాల అనంతరం 2015 జూన్‌ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. 2016 నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు.

హ్యూస్టన్‌లో హౌడీ-మోదీ సభ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని కుటుంబసమేతంగా భారత పర్యటనకు భారత్‌ ప్రధాని మోదీ ఆహ్వానించిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన అమెరికా-భారత్‌ దేశాల మధ్య సత్సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని భారత్‌ ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అమెరికా-భారత్‌ దేశాల మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్ని, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. భారత్‌ ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడన్ని, సమయం చూసునుకోని ఏదో ఓ సమయంలో ఇండియాకు వెళతానంటూ భారత పర్యటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.