చిత్తూరులో దారుణం..పెళ్లికి వచ్చిన చిన్నారిని..

వాస్తవం ప్రతినిధి: చిత్తూరులో మరో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి వచ్చిన చిన్నారులను సైతం కన్నేస్తున్నారు మానవ మృగాళ్లు. ఒకపక్క చిన్నారులపై ఇన్ని ఘోరాలు జరుగుతోన్నా.. వాటిపై అవగాహన కల్పిస్తున్నా.. కూడా.. చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు.

తాజాగా.. ఓ చిన్నారి దారుణహత్యకు గురైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మదనపల్లె సమీపంలో గల కురబలకోట మండలం అంగళ్ళ వద్ద చిన్నారి వర్షిణి దారుణ హత్యకు గురైంది. నిన్న రాత్రి తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చింది. బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. రాత్రి పీఎస్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, ఉదయం ఫంక్షన్ హాల్ వద్ద చిన్నారి మృతదేహం లభ్యమైంది.అయితే.. చిన్నారి పరిస్థితిని గమనించిన పోలీసులు.. చిన్నారిపై ఎవరో అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని అనుమానిస్తోన్నారు పోలీసులు.