హైదరాబాద్ లో పేలుడు కలకలం.. తీవ్ర గాయాల పాలైన మహిళ

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ మీర్ పేటలో ఉన్న విజయపురి కాలనీలో పేలుడు ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, చెత్త ఏరుకుంటున్న ఓ మహిళకు చెత్త కుప్పలో ఓ డబ్బా కనిపించింది. ఆ డబ్బాను ఆమె తెరిచే ప్రయత్నం చేసింది. డబ్బాను తెరిచేందుకు నేలకేసి కొట్టింది. దీంతో, భారీ శబ్దంతో డబ్బా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో షాక్ తిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.