దేశ భద్రత, సమగ్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదు: గఫూర్

వాస్తవం ప్రతినిధి: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ సందర్శనకు వచ్చే భారత సిక్కు యాత్రికుల పాస్‌పోర్టు విషయమై గందరగోళ పరిస్థితులను సృష్టించింది. కర్తార్ పుర్ కారిడార్ పూర్తయ్యిందని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నవంబరు 1న ట్విటర్ ద్వారా వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. కర్తార్‌పుర్‌ నడవా మీదుగా గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను దర్శించుకునే భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు అవసరం లేదని, కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని ఇటీవల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు అవసరమా లేదా అనే విషయంపై పాక్‌ స్పష్టత ఇవ్వాలని భారత్‌ అడిగింది. కర్తార్‌పుర్‌ సందర్శనకు వచ్చే భారత యాత్రికులకు పాస్‌పోర్టు తప్పనిసరి అని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. ఓ స్థానిక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ప్రకటన చేశారు.

కర్తార్ పుర్ నడవాను శనివారం ప్రారంభించనున్నారు. పాక్ లోని సరోవల్ జిల్లా గురుద్వారా దర్బార్ సాహిబ్ ను పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న డేరా బాబా నానక్ తో ఈ నడవా అనుసంధానిస్తుంది. ఈ నడవా మీదుగా రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనున్నారు. కర్తార్‌పుర్‌ సందర్శనకు వచ్చే భారత యాత్రికులకు పాస్‌పోర్టు తప్పనిసరి అని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. దీనిపై ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ స్పందిస్తూ… పాక్ భూభాగంలోకి వచ్చే ప్రతి ఒక్కరు న్యాయపరంగా రావాల్సిందేనన్ని, భద్రతాపరమైన కారణాల రీత్యా పాస్ పోర్టు ఆధారంగానే ఎవరినైనా దేశంలోకి అనుమతిస్తాం అన్ని, దేశ భద్రత, సమగ్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదు అని మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్ అన్నారు. భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు తప్పనిసరి అన్నట్లు మీడియా సంస్థ ‘డాన్‌’ పేర్కొంది.