గినియా లో ఘోర ప్రమాదం…పది మంది సజీవ సమాధి!

వాస్తవం ప్రతినిధి: పశ్చిమాఫ్రికా దేశమైన గినియాలో బంగారం, వజ్రాలు, బాక్సైట్‌, ఇనుప ఖనిజం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా మంది పేదరికంలో మగ్గిపోతున్న కారణంగా అక్రమ బంగారు గని తవ్వకాలు ఇక్కడ తరచూ జరుగుతుంటాయి. ఈశాన్య గినియాలో అక్రమంగా తవ్వకాలు కొనసాగుతున్న బంగారు గని కుప్పకూలింది. గనియా దేశంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటన పదిమంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. సిగ్విరి ప్రావిన్స్‌లోని కింటింగ్‌నాన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో గనిలో ఖనిజాన్ని వెలికితీస్తున్న వారిలో 10 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు వెల్లడించిన రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఎంతో మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అన్నారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది.