ఇరాన్ లో భారీ భూకంపం…ఐదుగురు మృతి

వాస్తవం ప్రతినిధి: వాయువ్య ఇరాన్ లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌కు సమీపంలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధీకృతమైందని యూఎస్‌ జియాలాజికల్‌ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకపంపం కారణంగా ఐదుగురు చనిపోయారు, మరో 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.