నా పాలనలో అమెరికా ఎకానమీ బాగుంది: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: తనను మరోసారి గెలిపించకపోతే దేశం మాంద్యంలోకి వెళుతుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రజలను హెచ్చరించారు. లూసియానాలో రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ నా పాలనలో అమెరికా ఎకానమీ చాలా గొప్పగా ఉంది అని అన్నారు. తనపై ఇంపీచ్ మెంట్ ప్రొసీడింగ్స్ ఈ నెల 13న మొదలవుతాయని హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడం షిఫ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దేశాన్ని చీల్చాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.