బ్రెజిల్‌ బ్రిక్స్‌ సదస్సుకు ప్రధాని మోడీ

వాస్తవం ప్రతినిధి: బ్రిక్స్‌దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 13, 14 తేదీలలో బ్రెజిల్‌లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకూటమి బ్రిక్స్‌అన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో సభ్య దేశాల మధ్య సహకార సంబంధాలను బలోపేతం చేసుకునే అంశంపై ఆయా దేశాల నేతలు చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ త్రిమూర్తి తెలిపారు. ప్రపంచంలోని జనాభాలో సగంపైగా అంటే దాదాపు 3.6 బిలియన్ల మందికి బ్రిక్స్‌ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.