పాకిస్తాన్‌ ను వదలని వాయు కాలుష్యం

వాస్తవం ప్రతినిధి: గాలి నాణ్యత స్థాయి తగ్గిపోవడంతో లాహోర్‌లో పాఠశాలలను మూసివేశారు. లాహోర్‌ ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌ గురువారం ఉదయానికి 114 గా ఉంది. అది ప్రమాదకర స్థాయి కావడంతో పట్టణంలో స్కూల్స్‌ అన్నింటినీ మూసివేస్తూ పాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ లో వాయు కాలుష్యం సమస్య అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకొని అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చలికాలం, పొగమంచు, ఆకస్మిక వాతావరణ మార్పులు, వాయువ్య దిశ నుంచి నగరంపైకి గాలుల ఉధృతి, చుట్టుపక్క రాష్ట్రాల్లోని పంట పొలాల్లో వ్యర్ధాల దహనం, భారీ పరిశ్రమలు వదులుతున్న రసాయన కారక వాయువులు, పౌరుల వ్యక్తిగత వాహనాలు ఇవే ప్రస్తుతం ఢిల్లీలో తిష్ట వేసిన కాలుష్యానికి ప్రధాన కారణాలుగా తెలుస్తుంది.