వన్డేలలో మరో మైలురాయి చేరుకొన్న స్మృతి మంథాన

వాస్తవం ప్రతినిధి: స్టార్‌ బ్యాట్స్‌ ఉమన్‌ స్మృతి మంథాన వన్డేలలో మరో మైలురాయి చేరుకుంది. వన్డేలలో అత్యంత తక్కువ మ్యాచ్‌లలో 2000 పరుగులు సాధించడంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని మించిపోయింది. కోహ్లీ 53 మ్యాచ్‌లలో 2వేల పరుగుల మైలురాయిని చేరుకోగా, మంథాన 51 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించింది. శిఖర్‌ ధావన్‌ 48 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించి భారత క్రికెటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా మహిళా క్రికెటర్లలో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయి చేరుకున్న వారిలో మంథాన మూడో స్థానంలో నిలిచింది. ఆసీస్‌ క్రీడాకారిణులు బెలిండా క్లార్క్‌(41), మెగ్‌ లానింగ్‌(45) మంథానకంటె తక్కువ మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అధిగమించారు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆవ్లూ 40 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అందుకుని అందరికంటె అగ్రస్థానంలో నిలిచాడు