‘అల వైకుంఠపురంలో’ సినిమా స్టోరీ ఇదే..?

వాస్తవం సినిమా: ‘నాపేరు సూర్య’ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో దాదాపు చాలా కాలం వరకు మరొక సినిమా ఓకే చేయడానికి టైం తీసుకున్నాడు అల్లు అర్జున్. ఇటువంటి నేపథ్యంలో చివరాకరికి తన కెరియర్ లో రెండు హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన ‘అలా వైకుంఠపురంలో’ సినిమా ఓకే చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా స్టోరీ గురించి సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినపడుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన స్టోరీ ఏమిటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అక్క పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తున్నట్లు సమాచారం.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి చెందిన అల్లు అర్జున్ కుటుంబం నుండి అక్క టబు బాగా డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్తుందట. అక్కడ జరిగే పరిణామాలు టబు కు ఇబ్బందికరంగా మారి సమస్యలు వస్తాయట. అయితే ఆ సమస్యలని ఎదుర్కొనేందుకు అల్లు అర్జున్ టబు ఇంట్లో కి వెళ్తాడట. అల్లు అర్జున్ టబు ఇంట్లోకి వెళ్లే సన్నివేశం దగ్గరనుండి అక్కడ చేసే సందడి వరకు చాల ఆసక్తికరంగా సాగుతాయట. ఈ సినిమాలో ట్విస్టులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో బన్నీ బిల్లియనీర్ గా మారిపోతాడట. ముఖ్యంగా టబు ఇంటిలో అల్లు అర్జున్ అడుగుపెట్టినప్పటి నుండి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.