సంక్రాంతి రేసులో వెనక్కి తగ్గిన మహేష్, అల్లు అర్జున్..?

వాస్తవం సినిమా: గత కొన్ని రోజుల నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఒకేరోజు విడుదల అవుతున్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఇలా ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ చేస్తే మేము చాలా నష్టపోతామని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలావుండగా రాబోయే సంక్రాంతికి కూడా ఒకేరోజు అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో అనే సినిమా మరియు మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 12వ తారీకున విడుదల అవుతున్నట్లు రెండు సినిమాలకు చెందిన నిర్మాతలు తేదీలు ప్రకటించడం జరిగింది.

ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు రెండు సినిమాల మద్యం కనీసం ఒక్కరోజైనా గ్యాప్ ఉండాలని నిర్మాతలను వేడుకొన్నారు. అంతేకాకుండా సినిమా ఒకే రోజు రిలీజ్ అయితే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా పరిస్థితులు దారితీస్తాయని చెప్పడంతో రెండు సినిమాల నిర్మాతలు ఆలోచించి దిల్ రాజు – అల్లు అరవింద్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

విషయంలోకి వెళితే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాను జనవరి 11న రిలీజ్ చేసి.. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో.. చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయాలనీ ఇరు నిర్మాతలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే థియేటర్స్ విస్తరణ విషయంలో మనస్పర్థలు తగ్గే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా న్యాయం చేసినట్లు అవుతుందని భావించినట్లు సమాచారం. దీంతో సంక్రాంతి రేసులో మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ పంతం నుండి వెనక్కి తగ్గినట్లు ఇండస్ట్రీలో వార్తలు జోరందుకున్నాయి.