బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ షాకింగ్ కామెంట్స్…!

వాస్తవం సినిమా: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 గత ఆదివారం జరిగిన ఎపిసోడ్ తో ముగిసింది. దాదాపు వంద రోజులకు పైగా జరిగిన ఈ షోలో 17 మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీపడగా కేవలం ఐదుగురు మాత్రమే ఫినాలే కి వెళ్లడం జరిగింది. అయితే ఫైనల్ కి వెళ్ళిన ఐదుగురిలో రాహుల్ గెలవడం జరిగింది. దీంతో టైటిల్ విన్నర్ రాహుల్ పేరు సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో మారుమ్రోగుతోంది. మరోపక్క చాలా టీవీ చానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ గురించి ఇంటి సభ్యుల గురించి అనేక విషయాలు చెప్పుకొస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకులు ఇచ్చిన రెమ్యునరేషన్ గురించి రాహుల్ షాకింగ్ కామెంట్ చేశారు. రాహుల్ ఏమన్నారంటే… బిగ్ బాస్ షో కోసం తనకు ఎంత ఇచ్చారనేది వ్యక్తిగత విషయమని.. అది బయటకి చెప్పలేనని అన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తానని.. అందరూ అనుకుంటున్నట్లు తనకు లక్షల్లో రెమ్యునరేషన్ ఇవ్వలేదని.. చాలా తక్కువ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.